బర్డ్ ఫ్లూ కారణంగా ఢిల్లీలో చికెన్ అమ్మకాల నిషేధం

బర్డ్ ఫ్లూ ఢిల్లీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో పౌల్ట్రీ లేదా ప్రాసెస్ చేసిన చికెన్ అమ్మకాలు, నిల్వ చేయడాన్ని నిషేధించారు. తదుపరి నోటీసు వచ్చేవరకు చికెన్ అమ్మకాలను ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ), దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ) బుధవారం నిషేధించాయి. పౌల్ట్రీ మాంసం మరియు గుడ్డు వంటలను వడ్డించవద్దని రెస్టారెంట్లను కోరారు. అంతకుముందు ఢిల్లీ వెలుపల నుంచి ప్రాసెస్ చేసిన చికెన్ సరఫరా పరిమితం చేయబడిందని అధికారులు పేర్కొన్నారు.