ముఖ్యమంత్రి ప్రకటనలు మాని రైతాంగాన్ని ఆదుకోవాలి: గాదె

ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు రూరల్ మండలం, గొర్లవారిపాలెం గ్రామంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు పరామర్శించారు. మిర్చి రైతులు మాట్లాడుతూ తమకు మిర్చి పంట పండించడానికి ఎకరానికి సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఖర్చయిందని ఈ అకాల వర్షాల వల్ల తాము పూర్తిగా నష్టపోయామని ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని, ఇదివరకు సబ్సిడీ మీద పట్టాలిచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా ఇవ్వలేదని చెప్పి తెలియజేశారు. అలాగే మిరప పంట అంతా కూడా తడిసిపోయి బూజు పట్టేలా ఉందని కాయలు రంగు తిరిగిపోయాయని దళారులు చాలా తక్కువ అడుగుతున్నారని రైతులు వాపోయారు. అదేవిధంగా పొగాకు రైతులు మాట్లాడుతూ పొగాకు పంట చేతికొచ్చాక గదులు కట్టి పొగాకు ఎండబెట్టే సమయానికి ఈ అకాల వర్షాల వల్ల క్వింటాకు పదివేలు రావలసిన పంటకి ఇప్పుడు మూడు నుంచి నాలుగు వేలు మాత్రమే వస్తున్నాయి. ప్రభుత్వం త్వరితగతిన తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రకటనలు మాత్రమే పరిమితం అయిందని, రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, కనీసం రైతులకి సబ్సిడీ మీద వచ్చే పథకాలు కూడా ఇవ్వకపోవడం రైతాంగం పట్ల వారికున్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది అని తెలియజేశారు. రైతులకు సలహాలు ఇవ్వాల్సిన రైతు భరోసా కేంద్రాలు కేవలం వైసీపీ నాయకుల బిల్డింగులకు అద్దె కట్టేటందుకే ఏర్పాటు చేశారని వాటి వల్ల రైతాంగానికి ఎలాంటి ఉపయోగం లేదని, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని తెలియజేశారు. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి త్వరితగతిన రైతాంగాన్ని అదుకోకుంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా సమయుక్త కార్యదర్శి చట్టాల త్రినాథ్, గుంటూరు నగర నాయకులు మధులాల్, గుంటూరు రూరల్ మండలం అధ్యక్షులు గంధం సురేష్, మండల కార్యదర్శులు పలకలూరి వెంకటేశ్వర్లు, సుభాషిని, గోపిశెట్టి సాయి, గొర్లవారిపాలెం జనసైనికులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.