చింతలపూడి జనసేన పార్టీ గ్రామ కమిటీ నియామకం

పొన్నూరు, చింతలపూడి గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ గ్రామ కమిటీని నియమించడం జరిగింది. చింతలపూడి గ్రామ అధ్యక్షుడిగా సాయినం సుధాకర్, ఉప అధ్యక్షులుగా చుండూరు మధుబాబు, గోళ్ళ శ్యామ్ మరియు ప్రధాన కార్యదర్శులు షేక్ ఆలీ, షేక్ గౌస్ భాష మరియు కార్యదర్శులను నియమించడం జరిగింది. అనంతరం నా సేన కోసం నా వంతు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిలు తాళ్లూరి అప్పారావు, దేశంశెట్టి సూర్య మండల అధ్యక్షుడు నాగిశెట్టి సుబ్బారావు, మండల కార్యవర్గ సభ్యులు వేముల నారాయణ, తమ్మిరిచ్ సురేష్, షేక్ బుడే, చందు కోటేశ్వరరావు, కొణతల వెంకట పవన్, తన్నీరు భీమర్జున్, గోణం ఉమా, జనసేన నాయకులు ఉప్పు గోపి, గడ్డమూరి చందు మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.