హుస్నాబాద్ అసెంబ్లీ బరిలో జనసేన పార్టీ

తెలంగాణ, హుస్నాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గ బరిలో జనసేన పార్టీ ఉండబోతుందని నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో 32 స్థానాల్లో జనసేన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీని అభిమానించే వాళ్ళు, పెద్ద సంఖ్యలో ఉన్నారని, గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు హుస్నాబాద్ మండల అధ్యక్షుడు మల్లెల సంతోష్, ఉపాధ్యక్షుడు కొలుగూరి అనిల్, సోషల్ మీడియా సెక్రెటరీ రెడ్డి గోపినాథ్, సైదాపూర్ మండల అధ్యక్షుడు పొడిశెట్టి విజయ్, చిగురుమామిడి మండల అధ్యక్షుడు గుండా సాయి చంద్, జెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.