మెగా ఫ్యాన్స్ కి ‘చిరు’ కానుక

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిరు 152వ సినిమా ‘ఆచార్య’ కు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు చిరు 152వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో రిలీజ్ కానుందని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ట్వీట్ చేసింది. చిత్రసమర్పకుల్లో ఒకరైన రామ్ చరణ్ స్పందిస్తూ, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో తాము రెడీ అని పేర్కొన్నారు.