లావణ్య కు వైరైటీగా విషెష్ అందించిన కార్తికేయ

అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున బర్త్ డే విషెష్ అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో లావణ్య నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రయూనిట్ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన ‘మల్లిక’ పాత్రలో లావణ్య త్రిపాఠి నటిస్తోంది. కార్తికేయ కాస్త వైరైటీగా లావణ్య కు విషెష్ అందించి వార్తల్లో నిలిచారు.

“మల్లీ.. ఈ రోజు నీ హ్యాపీ బర్త్ డే అంటగా..! చెప్పనేలేదు.. నువ్వు అట్టాగే ఉండు.. సాయంత్రం మన బ్యాచ్‌ని పట్టుకొస్తా.. అల్లాడించేద్దాం అంతే” అంటూ కామెంట్ వదిలారు. అంటే.. సాయంత్రం పార్టీ గ్రాండ్‌గా చేసుకొని చిల్ అవుదాం అన్నట్లుగా కార్తికేయ చెప్పిన తీరు నెటిజన్లను ఆకర్షిస్తోంది.