తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన చిత్రాడ గ్రామ నాయకులు, జనసైనికులు

పిఠాపురం, చిత్రాడ గ్రామం, జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ ఎంపీ సీటును కేటాయించిన సందర్భంగా చిత్రాడ మాజీ గ్రామ సర్పంచ్ తమ్ముడు సింగంపల్లి భాస్కరరావు నాయకులు జనసైనికులు ఉదయ్ శ్రీనివాస్ ని శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఉదయ్ శ్రీనివాస్ ని కాకినాడ ఎంపీగా అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందని పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకోవడానికి కూడా మరింత కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ కి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కి లక్ష ఓట్ల మెజారిటీతో పాటు ఎంపీగా కాకినాడ పార్లమెంటు స్థానంలో ఉదయ్ శ్రీనివాస్ కి కూడా అత్యధిక మెజారిటీ రావడానికి గట్టిగా కృషి చేస్తామని అలాగే ఉదయ్ మాతో మాట్లాడి అలాగే ఐటీకి సేవలు అందించాలని తెలియజేసే ఐటి టీంతో ప్రత్యేకమైన సమావేశం పెట్టి గ్రౌండ్ లెవెల్ లో ఒక బాధ్యతకి కృషి చేయాలని తెలియజేయడం మాకు సంతోషంగా ఉందని చిత్రాడ నాయకులు జన సైనికులు యువకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిత్రాడ గ్రామ ఎక్స్ సర్పంచ్ సీనియర్ నాయకులు తమ్ముడు సింగంపల్లి భాస్కరరావు , పెంకే జగదీష్, కింగం శివకృష్ణ, మడక జగదీష్, దేశిరెడ్డి సతీష్, తేలు శ్రీనివాస్, కె.రామకృష్ణ, గౌతమ్, గొర్రెల దీపు, కర్రీ అప్పారావు, కె .పండు, పి .మనోహర్, కోటేశ్వరరావు,. ఎం . సురేంద్ర, కె.వి.ఆర్.మహేష్, ఆర్.డి. శ్రీనివాస్, కె.మహేష్, ఆర్. ప్రేమ్ సాగర్, బి.శివకుమార్, మరియు నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.