వైసీపీ ఎమ్మెల్యే కి లేని ఆంక్షలు జనసేనకి మాత్రమే ఎందుకు!

  • జనసైనికుల్ని జైల్లో పెట్టినా పోరాటం ఆగిందా..లేక ఆపగలరా!!
  • హక్కుల్ని వినియోగించు కుంటున్నాం
  • మా పై దాడులు చేస్తే ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతాం
  • జనసేన నేతల హెచ్చరిక

తిరుపతి: శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేయ తలచిన సందర్భంగా వినుత కోటాని గృహ నిర్భంధం చెయ్యడం, జిల్లా కార్యదర్శి కొట్టే సాయిని చెయ్యి చేసుకుని అమానుషంగా పోలీస్ స్టేషన్ కి తరలించడాన్ని ఖండిస్తూ శుక్రవారం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతి ప్రెస్స్ క్లబ్ నందు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ మరియు నేషనల్ మీడియా ప్రతినిధి అజయ్ కుమార్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించి పోలీసుల అత్యుత్సాహం, దుశ్చర్యలను ఖండించడం జరిగింది. పాలక వైసిపి పార్టీ దౌర్జన్యాలను, దురాగతాలను, అవినీతిని ప్రశ్నిస్తే మాపై దాడులు చేసి, హౌస్ అరెస్టులు, కేసులు పెట్టడం, జైలుకు పంపడంలాంటి వాటికి పాల్పడుతున్న పోలీస్ అధికారుల దౌర్జన్యాలకు జనసేన పార్టీ భయపడదని తిరుపతి ప్రెస్ క్లబ్ లో జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి అజయ్ కుమార్ స్పష్టం చేశారు. మీడియా ముందు శ్రీకాళహస్తిలో జనసైనికులపై ఓ పోలీస్ అధికారిణి చేసిన అక్రమ దౌర్జన్యం, అరెస్టులను, దాడిని నిరసిస్తూ మీడియా అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి జనసేన నేతలు వినుత చంద్రబాబు, కొట్టే సాయిలు మాట్లాడుతూ ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డికి శ్రీకాళహస్తి ఏమైనా జాగీరా అని ప్రశ్నించారు. జనసైనికులు ఎంతమందిని జైల్లో పెట్టినా పోరాటం ఆగిందా లేక తగ్గిందా అన్నారు. వైసిపి వారు మా పవన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తే పోలీస్ ప్రొటెక్షన్, మేము వైకాపా దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తే కేసులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షించాల్సిన రక్షకబటులు ఐపీసీ సెక్షన్లను వదిలి వైసిపి సెక్షన్లను ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు. రానున్నది జనసేన పాలన అని తమపై దాడులు చేసిన ప్రతిది గుర్తుపెట్టుకుంటున్నామని, రివెంజ్ తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నేతలు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, వినుతకోట, కొట్టేసాయి రాజారెడ్డి, చంద్రబాబు, ముక్కు సత్యవంతుడు, ఆనంద్, కృష్ణయ్య, మహేష్, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.