డిజిటల్ క్యాంపెయిన్ లో చిత్తూరు జనసేన

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జనసేన పార్టీ పోరాటం చేస్తుందని దానిని ప్రయివేటు పరం చేయాడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్‌ గాంగారపు రామదాస్ చౌదరి, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ పేర్కొన్నారు. ‌సోమవారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే డిజిటల్ క్యాంపెయింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంద్రల హక్కు నినాదంతో ఎమ్మెల్యే, ఎంపిలకు డిజిటల్ పద్ధతితో నిరసన తెలియజేయడం జరుగుతోందని వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటికరణ వ్యతిరేక ఉద్యమంలో పార్టీలకతీతంగా పోరాడాలని పార్లమెంట్ సమావేశాల్లో ంఫ్లు అందరు ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపుతో ఇప్పటికే ట్విట్టర్ ద్వారా 10 కోట్ల మంది విశాఖ ఉక్కుపై స్పందించారని వివరించారు. కేంద్రం ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ మీద తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అనంతరం వేంపల్లి క్రాస్, బిస్కట్ ఫ్యాక్టరీ వద్ద వికలాంగులు, రైతులతో కలిసి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రటరీ సనావుల్లా, లీగల్ సెల్ అధ్యక్షుడు అమరనారాయణ, రెడ్డెమ్మ, పద్మావతి, చందు, రాము, జగదీష్, నవీన్, నౌషద్, అమర పాల్గొన్నారు.