తెలంగాణ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో పలు కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల వచ్చేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి పలు రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. ఇంజనీరింగ్, ఫార్మాలో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేశారు.

ఈసెట్ పరీక్షను జూలై 1న, పీజీఈసెట్ ఎంట్రన్స్ పరీక్ష జూన్ 20న నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కొన్ని ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ సిద్ధం చేసింది. అయితే టీఎస్ ఐసెట్, టీఎస్ ఎడ్‌సెట్, టీఎస్‌ పీఈసెట్, పీజీలాసెట్ లాంటి మరికొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్‌ల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నట్లు చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి తెలిపారు.