కరోనా ఎఫెక్ట్ తో పార్లమెంటు సమావేశాలు కుదింపు

పార్లమెంటు సమావేశాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా కారణంగా ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్దేశిత గడువు కంటే వారం ముందే ముగియనున్నాయి. కరోనాసోకుతున్న ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సభ్యుల భద్రత దృష్టిలో ఉంచుకొని  బుధవారoతో  సమావేశాలను ముగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం జరిగిన బీఏసీ సమావేశంలో అన్ని పక్షాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. సమావేశం జరిగే చివరి తేదీని సభాపతులు ప్రకటించనున్నారు. కాగా సమావేశాలు ముగిసేలోపు 11 ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులను ఆమోదింపజేసుకోవాలనే  అలోచనలో కేంద్రం ఉంది.