పంచకర్ల రమేష్ బాబుకు అభినందన సత్కారం

పెందుర్తి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీలో జాయిన్ అయిన విశాఖపట్నం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు 8వ వార్డ్ జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్థన శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుభాభినందనలు తెలుపుతూ, ఈ యొక్క మీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జనసేన పార్టీ మరింత అభివృద్ధి చెందాలని విజయవాడ అమ్మవారి శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండాలని అమ్మవారి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు నాయకులు గోపి, ప్రసాద్, గంగవరం రాజు, శ్రీను, నరేష్, దుబాయ్ రాజు, కార్తిక్, సూర్య, గావర శ్రీను, సిద్దు మరియు నాయకులు పాల్గొన్నారు.