నేడు రాష్ట్రపతితో కాంగ్రెస్ నేతల భేటీ..

రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు ఈరోజు (గురువారం) ఉదయం 10.45 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సేకరించిన రెండు లక్షల సంతకాల ప్రతులను రాష్ట్రపతికి అందజేయనున్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఈ సంతకాలు సేకరించింది. కాగా, రాహుల్ గాంధీ కాలినడకన రాష్ట్రపతి భవనానికి వెళ్లనున్నారు. విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు.