గుంటూరు జనసేన ఆద్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

  • రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్న వైసీపీ ప్రభుత్వం
  • వైసీపీ పాలనలో సామాన్యులకు దక్కని స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు
  • అంభేడ్కర్ ఆశయాలకు అడుగడుగునా తూట్లు పొడుస్తున్న వైసీపీ నేతలు
  • వైసీపీ అరాచక పాలనకు ప్రజలు ఘోరీ కట్టాల్సిన సమయం ఆసన్నమైంది
  • జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: ప్రతీ మనిషికి వ్యక్తిగత స్వేచ్ఛ, రక్షణ విస్తృతమైన ఆర్ధిక, సామాజిక హక్కులను కల్పిస్తూ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ సారధ్యంలో ఎంతోమంది మేధావుల మేధోమధనం నుంచి కోట్లాదిమంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత రాజ్యాంగం రచించబడిందని అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తూ రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. శనివారం రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా సంగడిగుంటలోని అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలతో పాటూ వెనుకబడిన తరగతుల ప్రజల అభ్యున్నతి కోసం తన జీవిత పర్యంతం శ్రమించిన అంభేడ్కర్ ఆశయాలను ఈ వైసీపీ ప్రభుత్వం ఛిద్రం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు, బీసీలకు, ముస్లిం మైనారిటీలకు రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసిందని దుయ్యబట్టారు. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకి, ప్రభుత్వానికి కరదీపిక లాంటిదని అలాంటి రాజ్యాంగాన్ని అడుగడుగునా ఉల్లంగిస్తూ రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఘోరీ కట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కులమతాలకతీతంగా ప్రతీఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా సమగ్ర రాష్ట్రాభివృద్ధే ద్యేయంగా డాక్టర్ బీ ఆర్ అంభేడ్కర్ ఆశయాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు సాగుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రతీఒక్కరూ అండగా నిలవాలని ఆళ్ళ హరి కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో గిడుతూరి సత్యం, కోనేటి ప్రసాద్, కోలా అంజి, దొంత నరేష్, శెట్టి శ్రీను, పురాణం కుమార స్వామి, ఇల్లా శేషు, దాసరి రాము, హరీష్, వడ్డె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.