కరోనా ఎఫెక్ట్‌.. చారిత్రక కట్టడాల మూసివేత

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే పరీక్షలు రద్దు చేసిన కేంద్రం తాజాగా మరో డెసిషన్ తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియంలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియంలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తాజ్ మహల్, పతేహ్ పూర్ సిక్రి, తదితర కట్టడాల సందర్శనకు అనుమతి లేదన్నారు.