పాక్‌ ప్రధానికి కరోనా.. ఇమ్రాన్‌ఖాన్‌ త్వరగా కోలుకోవాలని మోడీ ట్వీట్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ కోవిడ్ బారినపడ్డారు.. ఆయన వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో.. ఆయనకు నిన్న కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.. దీంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. హోం ఐసోలేషన్‌లో ఉన్నారని పాకిస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి ఫైసల్ సుల్తాన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే.. దీనిపై మనదేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కరోనా బారినపడ్డ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్‌ ప్రధాని మోడీ చేశారు. కాగా.. పాక్‌లోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు 6,23,135 కరోనా కేసులు నమోదవగా.. 13, 799 మంది కరోనాకు బలయ్యారు.