సుశాంత్ సింగ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రధానోత్సవం ఫిబ్రవరి 20న జరిగింది. ఈ సందర్భంగా సినిమా, టీవీ, మ్యూజిక్, ఓటీటీలకు సంబంధించి అవార్డులను ప్రకటించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పాటు దీపికా పదుకొణే, అక్షయ్ కుమార్, సుస్మితా సేన్, సురభి చంద, నోరా ఫతేహి వంటి సెలబ్రిటీలకు ఈ అవార్డ్ లను ప్రకటించారు.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ సినిమాకు ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకోగా, దీపిక పదుకొణే ఛపాక్ సినిమాకి గాను ఉత్తమ కథానాయికగా పురస్కారం అందుకుంది. గతేడాది అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విమర్శకులచే ప్రశంసలు పొందిన నటుడిగా చిచోరే చిత్రానికి అతడిని జ్యూరీ ఎంపిక చేసింది. ఇక కియారా అద్వానీ ‘గిల్టీ’ చిత్రంతో ‘విమర్శకులచే ప్రశంసలు పొందిన ఉత్తమ నటి’ విభాగంలో పురస్కారం సొంతం చేసుకుంది.