న్యాయవాదుల హత్య కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసు విషయంలో రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుంట శీను, చిరంజీవి ఇద్దరూ పథకం ప్రకారమే ఈ హత్యలు చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత వారు రామగిరి నుండి సుందిళ్ళ బ్యారేజీ ద్వారా మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకున్నారు. ఆ తర్వాత సుందిళ్ళ బ్యారేజ్ లో కత్తులు,సెల్ ఫోన్లు పడేసి వెళ్లారు. బట్టలు కూడా పడేసి వేరే బట్టలు మార్చుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఉదారి లచ్చయ్య, అక్కపాక కుమార్ లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని కుంటశీనుకు అందించారు. హత్యకు వినియోగించిన కత్తులు, వాహనం బిట్టు శీను సమకూర్చారని తెలిపారు. అయితే ఈ రిమాండ్ రిపోర్టులో ముగ్గరుని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు బిట్టు శీను, లచ్చయ్య పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.