దళితవాడల్లో వైసిపి బస్సు యాత్ర చేసే హక్కు లేదు: దోమకొండ అశోక్

విజయవాడ, దళితుల మేనమామ అంటూ దళితుల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగున్నర ఏళ్లలో దళితులకు చేసిన మేలు శూన్యం, దళితులకు మేలు చేయకపోగా దళితుల అభివృద్ధికి సంబంధించిన 27 పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. పేద దళిత విద్యార్థులకు ఉపయోగపడే విదేశీ విద్యను నిర్వీర్యం చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరును తీసేసి జగనన్న విదేశీ విద్య అని పేరు మార్చి దళితులను వైసిపి ప్రభుత్వం అవమానించింది. వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు తన కారు డ్రైవర్ గా పనిచేస్తున్న దళిత వ్యక్తిని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా ఇంకా వైసీపీలోనే ప్రోత్సాహాలను అందిస్తున్నారు. ఎక్కడుంది దళితుల ప్రాణాలకు రక్షణ అని ప్రశ్నిస్తున్నాను. దళిత ఆడబిడ్డలు హత్యాచారాలకు గురవుతుంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుంది. ఈ వైసీపీ ప్రభుత్వంలో దళిత ఆడబిడ్డలకు ఎక్కడుంది రక్షణ? దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను బనాయిస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ కు కుర్చీ ఇచ్చి, నిధులు యివ్వక, ఎస్సి సామాజికవర్గానికి న్యాయం చేశాం అంటే ఎలా ? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీల అభివృద్ధికి ఎన్ని నిధులు విడుదల చేశారో జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. దళితులను అవమానించి, ఆర్థికంగా చితకపోయేలా చేసిన వైసిపి పార్టీ చేపట్టే బస్సు ఎవరినీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎస్సీ సామాజిక వర్గ ప్రజలను మోసం చేసిన వైసీపీ నాయకులకు, జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ వాడల్లో తిరిగి ఓట్లు అడిగే హక్కు లేదు. అని జనసేన పార్టీ నాయకులు దోమకొండ అశోక్ వైసిపి నాయకులను హెచ్చరించారు.