గ్రామాల అభివృద్ధి బొలిశెట్టితోనే సాధ్యం!

  • నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: పట్టింపాలెం, వీరంపాలెం, బంగారు గూడెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీనివాస్ వర్మ విచ్చేసి ఉమ్మడి అభ్యర్థులతో గ్రామాలలో ప్రచారం జోరుగా సాగించారు. శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రోడ్ల వ్యవస్థపై, డ్రైనేజీల వ్యవస్థపై ప్రభుత్వాన్ని కడిగి పడేశారు. అంతేకాకుండా గ్రామాల్లో నిధులు పక్క ద్రోవ పట్టించడం సంక్షేమాలు గాలికి వదిలేయడం ఈ వైసీపీ ప్రభుత్వానికి చెందిందన్నారు. ఇక కొట్టు సత్యనారాయణనిచిల్లరి కొట్టు అని ఎద్దేవా చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఈ చిల్లర కొట్టు గురించి తెలియని ప్రజలు లేరని ఈయన చేసే లూటీ ఎలాంటిదంటే ఇల్లు కట్టు చిల్లర కొట్టు అనే దోరణలో ఈ ఐదు సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లి వాళ్ళ ఖజానా నింపుకొని ప్రజలను నట్టేట ముంచేసారని యగ్ధవా చేశారు. బొలిశెట్టి శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజల మధ్యనే ఉంటూ కరోనా సమయంలో కొన్ని కోట్లతో సేవా కార్యక్రమాలు చేస్తూ రఘురాం కృష్ణంరాజు సహకారంతో ఎంపీ నిధులనుంచి రెండు కోట్ల రూపాయల గ్రామాల అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తి మన బొలిశెట్టి అని ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఎంపీ అభ్యర్థిగా కమలం గుర్తుకు ఓటు వేసి కూటమి ఎమ్మెల్యే అభివృద్ధిగా బొలిశెట్టి శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆ గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వలవల బాబ్జి, ఈతకోట తాతాజీ, ముళ్ళపూడి బాపిరాజు, అడపా ప్రసాద్, పరిమి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.