సిరిపల్లిలో డిజిటల్ లైబ్రరీ ప్రారంభం

పి. గన్నవరం, సిరిపల్లి గ్రామంలోని శ్రీ జయంతి రామయ్య పంతులు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ₹30.60 లక్షల వ్యయంతో నిర్మించిన డిజిటల్ లైబ్రరీ రూమ్, ప్లే ఫీల్డ్, కిచెన్ గార్డెన్, ఇంకుడు గుంటలను సోమవారం పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. డిజిటల్ లైబ్రరీ ద్వారా గ్రామంలోని పిల్లలకు పుస్తకాలతో పాటు కంప్యూటర్లు, ఆన్‌లైన్ లెర్నింగ్ వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్లే ఫీల్డ్ పిల్లల్లో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యం, జట్టు భావం పెంపొందించేందుకు సహాయపడుతుంది. కిచెన్ గార్డెన్ పచ్చదనం, తాజా కూరగాయలు, పోషకాహారం అందిస్తే, ఇంకుడు గుంట వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను కాపాడుతుంది. ఈ సదుపాయాల కోసం కృషి చేసిన అందరికీ ఎమ్మెల్యే హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో సిరిపల్లి పాఠశాలను మండలంలో మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమం అనంతరం స్కూల్ భోజన సదుపాయాలను ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులతో కలసి భోజనం చేసి, వారికి గోరుముద్దలు తినిపించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-08-11-at-8.23.49-PM-1024x681 సిరిపల్లిలో డిజిటల్ లైబ్రరీ ప్రారంభం
WhatsApp-Image-2025-08-11-at-8.23.48-PM-1024x681 సిరిపల్లిలో డిజిటల్ లైబ్రరీ ప్రారంభం

Share this content:

Post Comment