చిన్నయ్యపేట, మురపాక గ్రామాల్లో క్రియాశీల సభత్వ కిట్ల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు మండలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికుల అభ్యున్నతికి తీసుకువచ్చిన క్రియాశీల సభత్వ కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం చిన్నయ్యపేట, మురపాక గ్రామంలో పర్యటించి జనసైనికులుకు కిట్లు అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో లావేరు మండల జనసేన నాయకులు బొంతు విజయకృష్ణ మాట్లాడుతూ ప్రతీ జనసైనికుడు తమవంతు బాధ్యతగా పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు పిన్నింటి రమణ, లంకాగోపాల్, సురేష్, రాజు, నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.