అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ

గుంతకల్లు నియోజకవర్గం, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయం సమీపమున అంబేద్కర్ విగ్రహం దగ్గర జనసేన పార్టీ అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరీ జీవన్ కుమార్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ విజయ, జనసేన పార్టీ నాయకులు బోయా విరేశ్ కుమార్, మారుతీ కుమార్ యాదవ్, ఆర్ సీ సురేష్ కుమార్, తాడిపత్రి మహేష్ కుమార్, ప్రకాష్, అరవింద్, ఏళ్ళి, రాజు, బాషా, జీలాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.