జనం కోసం పవన్ – పవన్ కోసం మనం

కాకినాడ రూరల్, జనం కోసం పవన్ – పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామంలో వై సావరం, బీసీ పేట, కొత్తపేట, కొలనీ ప్రాంతాల్లో స్థానిక జనసేన నాయకులు ప్రదీప్, ప్రసాద్, వినేష్, బాబు ఆధ్వర్యంలో పాద యాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, పాదయాత్ర సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ… జగన్ రెడ్డి ఆస్తులు అభివృద్ధి పదంలో – ఆంధ్ర ప్రజల జీవితాలు పాతాళంలో

  1. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తూ పొతే అతరువాత అభివృద్ధి చేసుకోవడానికి ఏమి ఉండదు. గజం నేల కావాలన్నా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి…
  2. రాష్ట్రంలో వైసీపీ నాయకులే భూకబ్జాదారులు
  3. నీవు చేసే పనులకి, నీవు తీసుకునే నిర్ణయాలకి మీ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ అసహ్యించుకుంటున్నారు.
  4. నీ స్టిక్కర్స్ పట్టుకుని ఇంటింటికి వెళ్ళి అంటించడానికి వైసీపీ నాయకులే భయపడుతున్నారు..
  5. ఏమి అభివృద్ధి చేసారని అడుగుతారేమో అని, ఛీ కొడతారెమోనని భయపడుతున్నారు.
  6. వాలంటీర్లను ఎంపిక ఎలా చేసారని? అసలు వీరి పని ఏమిటి అని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది..
  7. ప్రజలకి మేము ఇంత ఇస్తున్నాము అని బుక్స్ ప్రింట్ చేసి ఇస్తున్నారు కదా! అదే విధంగా ప్రజలు మీకు పన్నులు రూపంలో ఎంత ఇస్తున్నారో కూడా బుక్స్ ప్రింట్ చేసి మీ ప్రజా ప్రతినిధులు ద్వారా అందరికి అందిస్తే మీరు ఎంత ఇస్తున్నారు? ప్రజలు మీకు ఎంత ఇస్తున్నారు అనేది ప్రజానీకానికి తెలుస్తుంది. అప్పుడు ప్రజా స్పందన ఏమిటో? మీకే బోధపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.