జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

కళ్యాణదుర్గం నియోజకవర్గం: కంబదూరు మండలం, కదిరి దేవరపల్లి గ్రామంలో జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం మండల నాయకులు వెంకటేష్ ఆధ్వర్యంలో కంబదురు మండలం కదిరిదేవరపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెంబర్షిప్ తీసుకున్న వారికి జనసేన బ్యాగు, గాజు గ్లాసు, ఐడి కార్డు, నోటు పుస్తకం అందజేయడం జరిగింది. మెంబర్షిప్ తీసుకున్న వారికి అనుకోని సంఘటనల వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే హాస్పిటల్ ఖర్చులకోసం 50 వేల రూపాయలు ఒకవేల మరణించిన యెడల ఐదు లక్షలు చెక్కు నామినీకి అందజేయడం జరుగుతుంది అని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం జనసేన టిడిపి పార్టీల నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలో అని అనేక అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ కంబదూరు మండల అధ్యక్షుడు చంద్రమౌళి మండల ఉపాధ్యక్షులు వడ్డే శ్రీనివాసులు, గాజుల శ్రీనివాసులు, తిప్పేస్వామి రామ్ ప్రసాద్, మణికంఠ, సురేష్, నరేష్, మంజునాథ రెడ్డి, అశోక్, ప్రకాష్, మంజు, గోపాల్, నరసింహమూర్తి, అజయ్, జగపతి మరియు వంశీ వీరమహిళలు షేక్ తార, శ్రావణి టీడీపీ నాయకులు పీజీ రామకృష్ణ, గొల్లరామకృష్ణ, ఆంజనేయులు, హేమంత్, మహేంద్ర, నాగేంద్ర భాస్కర్ రెడ్డి, మొదలైన జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.