అంగరంగ వైభవంగా ఉమ్మడి మహబూబ్ నగర్ లో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి మహబూబ్ నగర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులు రామ్ తల్లూరి పిలుపు మేరకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి నాగర్ కర్నూల్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో కిట్ల పంపిణి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ… క్రియాశీలక సభ్యత్వాలు గత సంవత్సరం జరిగిన వాటి కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా జరిగాయి అని హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా ఉమ్మడి జిల్లాలో సభ్యత్వలు నమోదు చేయించిన ప్రతి ఒక్క కో – ఆర్డినేటర్ కు ఏది ఆశించకుండా క్రియాశీలక సభ్యత్వాల నమోదు కొరకు నిద్రలు మానుకొని మరి పార్టీ సభ్యత్వాల కోసం సహకిరించి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు జనసైనికులు ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుల కుటుంబాలను పరామర్శించి వారికి 5లక్షల చెక్కు అందజేయనున్న పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమం అతిత్వరలో జరగనుంది అని జనసైనికులకు పిలుపినిచ్చారు. పార్టీ బలోపేతం కోసం పార్టీ సిద్ధాంతం కోసం కట్టుబడి పవన్ కళ్యాణ్ ఆశయం డబ్బు లేని రాజకీయం చేయడం కోసం మనమంతా ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణి కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎండి మహబూబ్, జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులు బైరపోగు సాంబ శివుడు జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ పి.ఆర్.రాఘవేంద్ర జనసేన పార్టీ నాగర్ కర్నూల్ పి.ఈ.సి మెంబర్ జానీ జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ వింగ్ కమిటీ సభ్యులు గోపాస్ కురుమన్న, ఎమ్.రెడ్డి రాకేష్ రెడ్డి, బారిగారి రాజేందర్, సూర్య జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థి విభాగం కో-ఆర్డినేటర్స్ శరత్ గౌడ్, మున్న సాయి జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ హరి నాయక్, లక్ష్మి నారాయణ, శరత్, సురేందర్, అన్వేష్ రెడ్డి మరియు నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు గోపాస్ రమేష్, భోట్కా రమేష్, లింగం నాయక్, రాజు నాయక్ మహబూబ్ నగర్ నియోజకవర్గ నాయకులు హుస్సేన్, కళ్యాణ్, నర్సింహా, ఎద్దుల శ్రీనివాసులు, వనపర్తి నియోజకవర్గ నాయకులు విజయ్, మూర్తి, శ్రీకాంత్, ఉత్తేజ్, సురేష్, శేఖర్, హేమావర్ధన్, బాల కృష్ణ, శివ, గద్వాల్ నియోజకవర్గ నాయకులు జమన్నా, గంగు, చరణ్, టి.రవి, రఘు, నవీన్, అల్తాఫ్, డి.రవి, ఇస్లాం, అంజి, రఘు, పరశరాములు, కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు పోలోజు రఘు, మల్లేష్, మున్నా అచంపేట్ నియోజకవర్గ నాయకులు జెర్రిపాటి చంద్రశేఖర్, ఎస్.పి.సూర్య, విజయ్, తిరుపతయ్య, పాండు, హేమంత్, శేఖర్, మాతృ మరియు ఉమ్మడి జిల్లా జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.