సింగనమల జనసేన ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక కార్యకర్తలకు కిట్ల పంపిణీ

సింగనమల: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్నవారికి ఆదివారం మండల కేంద్రం లోని వాల్మీకి దేవాలయం కమ్యూనిటీ హాల్ లో ఘనంగా సభ్యత్వ కిట్ల పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ అధ్యక్షతన.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్యక్షుడు జయరాం రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించే తత్వం రావాలని.. అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ధి పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పు కోసం జరుగుతున్న ఉద్యమాలు యువతరమే ప్రధానంగా తమ గళం వినిపిస్తోందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సింగనమల నియోజకవర్గ జనసేన పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను.. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యుడు ఇంటి ఇంటికి తీసుకెళ్లి పార్టీని సింగనమల నియోజకవర్గంలో బలపరచాలని కోరారు. జనసేన పార్టీ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. మండల అధ్యక్షుడు గంజికుంట రామకృష్ణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ కోసం నిరంతరం శ్రమించే జన సైనికులకు వీర మహిళకు కుటుంబంగా భావించి వారి యోగక్షేమాలు ఆకాంక్షించి జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన మహా సంకల్పం క్రియాశీలక సభ్యత్వం అని అన్నారు. జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారిలో ఎవరైనా ప్రమాదవశాత్తు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఐదు లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది అన్నారు. దేశంలో మొట్టమొదటి సారిగా కార్యకర్తల సంక్షేమం కోసం ప్రమాద బీమాను అందించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే అని, రాజకీయం కేవలం డబ్బున్న వారు మాత్రమే చేయగలరు అనే స్థాయి నుండి సామాన్య వ్యక్తులతో రాజకీయాలు చేయించగల సత్తా ఒక పవన్ కళ్యాణ్ గారి కి మాత్రమే ఉందని అలాంటి నాయకుని మనం 2024లో ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోతే ఈ రాష్ట్రం మరింత దౌర్భాగ్య స్థితిలో కి వెళుతుందని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుండి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు బయటికి తీసుకు రాగలరు అని పూర్తి వివరాలు క్రియాశీలక సభ్యులకు అందించిన కిట్లలో సమాచారం ఉందని, ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. సీనియర్ నాయకులూ భాస్కర్, ప్రవీణ్ లు మాట్లాడుతూ.. నియోజక వర్గం లోనే ఎక్కువ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసిన ఘనత నార్పల మండల జనసైనికులకే దక్కుతుందని.. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసారు. క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన వాలంటీర్లు కలువాయి విశ్వనాధ్ రెడ్డి, గంజికుంట రామకృష్ణ, పొన్నతోట రామయ్య లకు పార్టీ జండా కప్పి.. ప్రశంసాపత్రం అందించి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళా కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి, జిల్లా అధికార ప్రతినిధి మురళి కృష్ణ, కార్యదర్శి చంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శులు జయమ్మ, పురుషోత్తం రెడ్డి, మండల సీనియర్ నాయకులు తుపాకుల భాస్కర్, కలువాయి విశ్వనాథ్ రెడ్డి, కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ రామయ్య, శివయ్య, పృద్వి, లోకేష్, రాజు, చెన్నమ్మ, తేజలక్ష్మి, సురేష్, నజీర్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొన్నారు.