జనసేన పార్టీ మద్దతు కోరిన కోటారెడ్డి

కావలి నియోజకవర్గం: కావలి జనసేన పార్టీ ఆఫీస్ కి నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డీ ప్రభాకర్ రెడ్డి అన్నగారు కోటారెడ్డి విచ్చేసి కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్ ని కలిసి జనసేన పార్టీ తరుపున వారికి మద్దతు కోరారు. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ గారు మాట్లాడుతు కోటారెడ్డి గారు మా పార్టీ కార్యాలయానికి విచ్చేసి వారి తమ్ముడు నెల్లూరు టీ డీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జనసేన పార్టీ తరుపున మద్దతు కోరారు అని, తప్పక మీ అందరి ఓటు ఎంపీ అభ్యర్థికి పడేలా చూడాలని కోరారు. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలకూడదని మేము మా సీట్లు తగ్గించుకొని ఈ రాక్షసపాలన పారద్రోలడానికి ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలపాలని వారి అదేశానుసారం మా మద్దతు తప్పక మీకు ఉంటుందని రేపటి నుంచి మేము అన్ని మండలాల్లో మరియు కావలి టౌన్, మున్సిపాలిటీ పరిధిలో జనసేన పార్టీ తరుపున ఒక ప్రణాళిక ప్రకారము ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని మాట ఇవ్వడము జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన పార్టీ 4 మండలాల అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.