గెడ్డం బుజ్జి పుట్టినరోజు సందర్భంగా రోగులకు పాలు, రొట్టె పంపిణీ

పాయకరావుపేట, నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ జనసేన-టిడిపి సంప్రదింపుల సమన్వయ బాద్యులు గెడ్డం బుజ్జి పుట్టినరోజు సందర్భంగా జనసేనపార్టీ నాయకులు నల్లల రత్నాజి ఆధ్వర్యంలో గొడిచెర్ల పి హెచ్ సి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరియు గర్భిణి స్త్రీలకు పాలు, రొట్టె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నల్లల దొరబాబు జనసైనికులు చింతరెడ్డి చరణ్, నల్లల సాయి, దొమ్మేటి చరణ్, ఉప్పాటి అరుణ్, నాని తదితరులు పాల్గొన్నారు.