ప్రధాని మోడీకి ‘లెజియన్ ఆఫ్ మెరిట్‌’ అవార్డును ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా ప్రఖ్యాత ‘లెజియన్ ఆఫ్ మెరిట్‌’ అవార్డును లభించింది.  భారత్ అమెరికా ల మధ్య ద్వైపాక్షిక బంధాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో నాయకత్వం వహించిన మోడీకి లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డును ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా అవతరించడంలో మోడీ చేసిన విశేష కృషిని ఆయన ప్రశంసించారు. వైట్‌హౌస్‌లో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ నుంచి ప్రధాని తరఫున ఈ అవార్డును అమెరికా భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు స్వీకరించారు.

అధ్యక్షుడు ట్రంప్.. అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడంలో నాయకత్వం వహించినందుకు లెజియన్ ఆఫ్ మెరిట్‌ను భారత ప్రధాని నరేంద్ర మోడీకి అందజేశారు’ అని రాబర్ట్ ఓబ్రెయిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. మోడీకి లెజియన్ ఆఫ్ మెరిట్ అత్యున్నత డిగ్రీ చీఫ్ కమాండర్‌ అవార్డును అందజేశారు. ఈ అవార్డును రాష్ట్ర అధిపతికి లేదా ప్రభుత్వానికి మాత్రమే ఇస్తారు. ప్రపంచ శక్తి భారతదేశాన్ని ఎదిగేందుకు ప్రపంచ సవాళ్లను పరిష్కరించే దిశగా అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో నాయకత్వం వహించినందుకు గుర్తింపుగా మోడీకి ఈ అవార్డు లభించింది.