జనసేనాని ఆదర్శంగా గంగారపు రామదాస్ చౌదరి మసీదుకు విరాళం

మదనపల్లె నియోజకవర్గం, రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లెలో మసీదు నిర్వహణ, మరమ్మత్తులు, కోసం 10 వేల రూపాయల విరాళంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి ముస్లిం మత పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మసీదుల అభివృద్ధి కోసం ఇటీవల 25 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఆయన స్పూర్తితో తన వంతు సాయంగా తిరుమలరెడ్డిపల్లెలో ఉన్న మసీదు నిర్వహణ కోసం రూ.10 వేలు విరాళం ఇవ్వడం జరిగిందని వివరించారు. మసీదు ముతవల్లి ఆన్సర్ బాషా ఇమాం నౌషాద్ బాబుబై షరీఫ్ జబిఉల్లా కార్యదర్శి అమీరుసాబు గురువులకి రూపాయలు 10 వేలు అందజేశారు.‌ ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, జిల్లా కార్యదర్శి సనఉల్లా రామసముధ్రం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, మదనపల్లె రూరల్ అధ్యక్షుడు గ్రానైట్ బాబు ఐటి విభాగం జగదీష్, కార్యదర్శి లక్ష్మీపతి కుమార్, జనార్ధన క్రాంతి కుమార్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.