జనసేనాని సీఎం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ పిల్లా దీపికా శ్రీధర్

  • దత్త జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేసి అధిక మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అవ్వాలని డాక్టర్ పిల్లా దీపికా శ్రీధర్ ప్రముఖ పుణ్యక్షేత్రం పాదాగయ నందు 108 కొబ్బరి కాయలతో ప్రత్యేక పూజలు

పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ దత్త జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొంది మరియు ముఖ్యమంత్రి అవ్వాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున కుటుంబ సమేతంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయము నందు, స్వయంబు వెలసిన దత్తాత్రేయుని సన్నిధిలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం ప్రజల కోరిక మేరకు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని కుటుంబ సమేతంగా దత్త జయంతి సందర్భంగా 108 కొబ్బరి కాయలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దత్తుని అనుగహ్రహంతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి పోటీచేస్తే అత్యధిక మేజర్టీతో గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకొంటామని అది పిఠాపురం ప్రజల కోరిక అని తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ 23వ తారీఖున జరగబోయే ఐక్యరాజ్యసమితి సమావేశాలకి భారతదేశం నుంచి నలుగురు వ్యక్తులను పిలుస్తారు.. అందులో ఒక వ్యక్తి మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అవ్వడం మన రాష్ట్రము చేసుకున్న అదృష్టమని, దేశం కోసం పాటుపడిన నాలుగురు వ్యక్తులను పిలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు మన దేశం కోసం ఎంత పాటు పడుతున్నారనేది మన ప్రజల కన్నా ముందు ఐక్యరాజ్యసమితి గుర్తించింది కాబట్టి 2024 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి మన కష్టాలన్నీ కూడా తీర్చాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున మా కుటుంబ సభ్యుల తరఫున దత్త జయంతి సందర్భంగా కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని మీడియా ముఖంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మత్సకార నాయకులు పల్లేటి బాపన్న దొర, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, కందరాడ ఎంపీటీసీ పిల్లా సునీత, పిల్లా దినేష్, గట్టెం భీమరాజు, పిల్లా నాగేశ్వరరావు, పిల్లా ముత్యాలరావు, కందరాడ మాజీ సర్పంచ్ బొంతులాచారావు,వాకపల్లి సూర్యప్రకాష్, మాసా పెద్దపుత్రయ్య, సైతన చిట్టిబాబు, గుర్రం గంగాధర్, పిల్లా దాసు, డి సింహాచలం మరియు జన సైనికులు కార్యకర్తలు వీర మహిళలు నాయకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం జరిగింది.