అంతర్వేదిలో 144 సెక్షన్ అమలు

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో రథ దగ్దo ఘటన నేపధ్యంలో   హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు ఏపీలోని కొన్ని పార్టీలు సైతం ఈ విషయంపై సీరియస్ కావడంతో అంతర్వేదిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రథం ధ్వంసం విషయంపై ఏపీ ప్రభుత్వం సీబీఐ తో విచారణ చేయించేందుకు సిద్ధం అయ్యింది. అంతర్వేదిలో పరిస్థితులు చేయిదాటి పోకుండా ఉండేందుకు 144 సెక్షన్ ను అమలు చేస్తున్నది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అంతర్వేది ఆలయ పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ కూడా రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.