పణతాల హరిని బెయిల్ పై విడిపించిన ఎన్ని రాజు

రాజాం: పణతాల హరిని రేగిడి ఆముదాలవలస పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసి, రాజాం పోలీస్ స్టేషన్లో ఐపీసి 5/4 ఐపీసి 5/5 ఐపీసి 67(2) ఐటీ యాక్ట్ ఈ సెక్షన్ల మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ముందుగానే విషయం తెలుసుకున్న రాజాం నియోజకవర్గం నాయకులు ఎన్ని రాజు రాజాం పోలీస్ స్టేషన్లో రాత్రి 8 గంటలకి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిపించడం జరిగింది. దీనికి సహకరించిన రేగిడి ఆమదాలవలస మండల అధ్యక్షుడు అప్పలనాయుడు, రాజాం మండల జడ్పిటిసి అభ్యర్థి సైరాడ జనార్దన్ రావు, వీరమహిళ సాయి మణి, కెల్లా సూర్యనారాయణ రావు, మొగిలివలస అన్నం నాయుడు, కిరణ్, రమేష్, వీర ప్రవీణ్, అనుదీప్, రామకృష్ణ, మొగలివలస జనసైనికులు అలాగే కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.