ఉత్కంఠగా విశాఖ కార్పొరేషన్‌ కౌంటింగ్‌..

విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆదివారం కౌంటింగ్‌ కొనసాగుతోంది. పలు మున్సిపాలిటీల్లో వైసిపి అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం విశాఖ కార్పొరేషన్‌ కౌంటింగ్‌ పై ఉత్కంఠ నెలకొంది. కొత్త రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నేపథ్యంలో.. ఎన్నికలు జరగడంతో ప్రజల్లో విశాఖ ఫలితాలపై ఆసక్తి రేకెత్తుతోంది. విశాఖలో మొత్తం 98 డివిజన్లలో కౌంటింగ్‌ కొనసాగుతోంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. విశాఖ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాసేపట్లో ఫలితాలు రానున్నాయి.