కల్తీ మద్యంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి: శశిరేఖ

  • వైసిపి ప్రభుత్వం మద్యంపై విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం

అనంతపురం: వైసిపి ప్రభుత్వం గత ఎలక్షన్లకు ముందు జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి ఈరోజు తనకు ఇచ్చిన హామీకి కట్టుబడకుండా రాష్ట్రంలో నాసిరకమైన మద్యాన్ని తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోకుండా మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుస్తున్నాడు. మద్యపానం నిషేధం చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఆ మద్యపానం నిషేధం చేయకుండా కల్తీ మద్యాన్ని రాష్ట్రంలోకి తీసుకువచ్చి ఆ కల్తీ మద్యం ద్వారా వచ్చిన ఆదాయంపై అప్పులు తెస్తూ రాష్ట్ర పరిపాలన సాగిస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబం వ్యక్తులు రోజుకు 300 రూపాయలు సంపాదిస్తే దానిలో 200 రూపాయల దాకా నాసిరకమైన మద్యానికి ఖర్చు చేస్తూ తన ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. మద్యపానం నిషేధమని చెప్పిన జగన్ రెడ్డి రాష్ట్రంలో మద్యంను ఏరులై పారిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాసిరకమైన మందులు తాగి మృతి చెందిన వారి వివరాలను బహిర్గతం చేయాలని మృతి చెందిన కుటుంబాలకు భరోసా కల్పించాలని జనసేన మహిళ నాయకురాలు శశిరేఖ డిమాండ్ చేయడం జరిగింది.