ఎర్రకోటపై జెండా ఎగురవేసిన రైతులు

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ‘ట్రాక్టర్ ర్యాలీ’ చేపట్టిన రైతులు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎర్రకోటను ముట్టడించారు. ఎర్రకోట బురుజుల పైకి చేరి ఫ్లాగ్ పోల్‌పై జెండాలు ఎగరేశారు. రిపబ్లిక్ డే పరేడ్‌ కంటే ముందే ఉదయం ట్రాక్టర్ ర్యాలీ చేపట్టిన రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోకి వివిధ ప్రాంతాల నుంచి అడుగుపెట్టారు. వారిని నిరోధించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో రైతులు బారికేడ్లు దాటే ప్రయత్నం చేశారు. వారిని నిరోధించే క్రమంలో భాష్పవాయిగోళాలు, లాఠీలకు పోలీసులు పని చెప్పారు. ఐటీఓ వద్ద రైతులు-పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న క్రమంలోనే ఒక గ్రూపు ఎర్రకోట వైపు దూసుకువెళ్లింది. ఎట్టకేలకు ఎర్రకోట చేరిన రైతు ఆందోళనకారులు ఎర్రకోట బురుజులపై జెండాలు ఊపుతూ హడావిడి చేశారు. తమకు నిర్దేశించిన మార్గంలో కాకుండా రైతు నిరసనకారులు వేరే మార్గంలో ఎర్రకోటకు చేరినట్టు చెబుతున్నారు.