‘బ్లాక్ డే’ను పాటిస్తున్న రైతులు.. ఢిల్లీ సరిహద్దుల దిగ్బంధం..

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలు రోజు రోజుకు ఉదృతం అవుతున్నాయి ఈ సందర్భంగా రైతులు నేడు ‘బ్లాక్ డే’ను పాటిస్తున్నట్టు చెప్పారు. రైతుల ఉద్యమం నేటికీ వంద రోజులు పూర్తయింది. దీంతో రైతులు ఈరోజు నుంచి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని రోడ్లను దిగ్బంధం చేయాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లను దిగ్బంధం చేయాలని రైతులు సంకల్పించుకున్నారు. వెస్టర్న్ ఫెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ హైవే ను 5 గంటలపాటు దిగ్బంధించబోతున్నారు. గత నవంబర్ 26వ తేదీ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు.