అకాల మిచౌన్ వర్షాల వల్ల రైతుకు కన్నీళ్లు

రాజోలు నియోజకవర్గం: ఈదరాడ, కే.ఎస్.ఎస్ రాష్ట్ర రైతువిభాగం అధికార ప్రతినిధి యెరుబండి చిన్ని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా పలురకాల పంటలు నీళ్ళపాలై రైతన్నలు కుదేలయ్యారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో భారీగా పంటనష్టం వాటిల్లింది. వరి పంట పన్నలు నానిపోయి మొలకలు వచ్చేస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి ఎక్కువైపోయి నష్టాల్లో ఉన్న రైతుకు మిచౌన్ వర్షంతో మరింత కుదేలైన రైతులను సకాలంలో ప్రభుత్వం ఆదుకోవాలని, కుదేలైన రైతును అధికారులు మానవతా దృక్పదంతో పంటననష్టం వెలకట్టి తక్షణం ప్రభుత్వంచే ఇప్పించాలని లేకపోతే జనసేన మరియు కే.ఎస్.ఎస్ రైతువిభాగంనుచి ఆందోళనలు ఉదృతం చేస్తాం అన్నారు.