టూరిజం ప్రదేశాల్లో సినిమాల చిత్రీకరణ

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిలించాంబర్ లో టాలీవుడ్ సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… సినిమా షూటింగులతో పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిత్రీకరణల కోసం నిర్మాతలు ముందుకొచ్చారని వెల్లడించారు. టూరిజం ప్రదేశాల్లో సినిమా షూటింగులపై వారంలోగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ప్రణాళిక రూపొందించాక సిఎం కెసిఆర్ ను కలుస్తామని వివరించారు.