జనసైనికుడు రవి కుటుంబానికి ఆర్థిక సహాయం

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన పార్టీ జనసేవ కార్యక్రమంలో భాగంగా గొల్లపల్లి గ్రామం, దాడితల్లి కాలనీకి చెందిన గలగట్ల రవి ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, మండల అధ్యక్షులు సంచన గంగాధర్ మరియు గొల్లపల్లి జనసైనికులు రవి కుటుంబానికి 10,000/- ఆర్థిక సహాయం అందజేయడంతో పాటుగా ఎటువంటి సమయంలోనైనా జనసైనికులు మీకు అండగా ఉంటారని భరోసా కల్పించడం జరిగింది.