పవన్ కళ్యాణ్ ను విమర్శించే వారికి గట్టిగా బదులిస్తాం: శేషుబాబు

అవనిగడ్డ, షరతులు గల పట్టా భూమిని నిషేధపు భూముల జాబితా నుండి తొలగింపు కార్యక్రమం కోసం జరిగిన బహిరంగ సభకు అవనిగడ్డకు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పి వెళ్లిపోతే బాగుండేదని, అలా కాక పవన్ కళ్యాణ్ ని విమర్శించడం చూస్తుంటే ఎంతగా భయపడుతున్నారో తెలుస్తుందని, పవన్ కళ్యాణ్ నామస్మరణ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఉండలేకపోతున్నారని, నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ ని గుర్తుకు తెచ్చుకుంటున్నారని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం తప్ప సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక మూడు పెళ్లిళ్లు విషయాన్ని పదేపదే వైసిపి నాయకులు ప్రస్తావించడాన్ని ఆయన తప్పు పట్టారు. నిండు బహిరంగ సభలో జగన్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి మహిళలంటే గౌరవం ఉండదని కించపరుస్తూ మాట్లాడటం చూస్తే ఎవరికి మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసని, పవన్ కళ్యాణ్ చట్టబద్ధంగా విడాకులు తీసుకుని, తగిన పరిహారం కూడా వారి భార్యలకు అందించి, సమాజంలో గౌరవంగా బతుకుతున్నారని, ఇన్ని సంవత్సరాలుగా మీ వైసీపీ నాయకులు పదేపదే వ్యక్తిత్వ హననం చేస్తున్నప్పటికీ చాలా ఓర్పుగా, నిబ్బరంగా, సంయమనంతో ఉన్నారని, ఆ తిట్లు బాధ ఎలా ఉంటుందో మీకు కూడా రుచి చూపించాలని మంగళగిరి సభలో ఒక్కసారి మాత్రమే బూతులు మాట్లాడారని, అక్కడ తప్ప ఇంకెక్కడ పవన్ కళ్యాణ్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించలేదని గుర్తు చేశారు. మీ నాయకులు అన్నా రాంబాబు తిట్టిన భూతు పురాణానికి జనసేన కార్యకర్త ప్రాణాలు విడిచారని, కొడాలి నాని, దువ్వాడ శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటివారు మరియు శ్రీరెడ్డి, కత్తి మహేష్, పోసాని కృష్ణ మురళి లాంటివారు పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టడానికి ఏమైనా పేటెంట్ తీసుకున్నారా, వారు బూతులు తిడుతుంటే మీరు నివారించాల్సింది పోయి పైశాచిక ఆనందం పొందుతున్నారని, డిక్షనరీలో లేని బూతు పదాలకు అర్ధాలు చెప్పే మీరు మహిళలు, కాలేజీ ఆడపిల్లలు ఉన్న నిండు సభలో నా వెంట్రుక కూడా పీకలేరు అని మాట్లాడిన మీరు పవన్ కళ్యాణ్ కి నీతులు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉండగా 1,34,000 కోట్ల అవినీతి చేశారని చంద్రబాబు ప్రభుత్వం పై ఒక పుస్తకమును ముద్రించిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు, అలాగే టీటీడీ బోర్డులో సభ్యుడుగా ఉన్న శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని ఆరోపించిన మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ గా మారిపోయారా, అత్నికి క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు, పదవి ఎందుకు ఇచ్చారు, అలాగే ప్రతిపక్షంలో ఉండగా ఇసుకను పక్క రాష్ట్రాలకు టిడిపి ప్రభుత్వం అమ్ముకుంటుందని ఆరోపించిన మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఇసుక విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని నివేదిక ఎలా ఇచ్చారు. అంటే 60 : 40 బంధం ఎవరిదో ప్రజలందరూ తెలుసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ బిజెపితో మాత్రమే పొత్తులో ఉన్నారు. ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. లేనిపోని నిజం కాని ఆరోపణలు ఎంత కాలం చేస్తారు, చీకటి బంధం రాత్రి సంబంధాలు కొనసాగించేది మీరే, మీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత లేదు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు రంగాని హత్య చేసిన పార్టీ వారితో పవన్ కళ్యాణ్ జతకడుతున్నాడని, కాపులను వేరే పార్టీకి తాకట్టు పెడతారని, కాపులు పవన్ కళ్యాణ్ వెంట ఉండొద్దని విమర్శించడం పై ఆయన స్పందిస్తూ వంగవీటి మోహన రంగా హత్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్న దేవినేని కుటుంబం మీ పార్టీలో లేదా, రంగా గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డి మీ పార్టీలో ఉన్నత పదవిలో లేరా వారి గురించి మీ పార్టీలో ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా ముందు మీ పార్టీలో ఉన్న మలినంను తొలగించుకోండి, కాపులను ఉద్ధరించేస్తాం, కాపుల కోసం జగన్ చాలా చేసేస్తున్నాడు లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం మానండి. 1000 సార్లు సమాధానం చెప్పడానికైనా జనసైనికులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అలాగే గత ప్రభుత్వంలో డెల్టా ఆధునికీకరణ పనులు చేసిన కాంట్రాక్టర్ మీద అనేక అవినీతి ఆరోపణలు చేసిన మీరు అదే కాంట్రాక్టర్ చేత ఇప్పుడు ఎలా అంట కాగుతున్నారు, ఎదుటివారికి చెప్పటానికేనా నీతులు ఉన్నది అని ఆయన ధ్వజమెత్తారు.