ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

కేరళ, పశ్చిమ్‌ బంగా, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అసోం – మూడు విడతల్లో పోలింగ్‌ (మార్చి 27, ఏప్రి ల్‌ 1న, ఏప్రిల్‌ 6).. కేరళ- ఒకే విడత (ఏప్రిల్‌ 6).. తమిళనాడు- ఒకే విడత (ఏప్రిల్‌ 6).. పుదుచ్చేరి- ఒకే విడత (ఏప్రిల్‌ 6).. పశ్చిమ్‌ బంగా- ఎనిమిది దశల్లో (మార్చి 27, ఏప్రిల్‌ 1న, ఏప్రిల్‌ 6న, ఏప్రిల్‌ 10న, ఏప్రిల్‌ 17న, ఏప్రిల్‌ 22న, ఏప్రిల్‌ 26న, ఏప్రిల్‌ 29న) ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ తెలిపారు. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మే 2న ఉంటుంది. ఆన్‌లైన్ వేదికగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఈసీ కల్పించింది. తిరుపతి సహా ఇతర ఉప ఎన్నికలకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించింది.