జనసేనలోకి పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే తనయుడు

పెదకూరపాడు: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన మాజీ శాసన సభ్యులు అల్లం శెట్టి విశ్వేశ్వరరావు తనయుడు అల్లం శెట్టి వెంకటేశ్వరరావు శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. అల్లం శెట్టి వెంకటేశ్వరరావుతో పాటు బీరవల్లిపాయ గ్రామ ప్రస్తుత ఉపసర్పంచ్ పసుపులేటి వెంకటస్వామి పార్టీలో జాయిన్ అయ్యారు. పెదకూరపాడు నుంచి 1983లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అల్లం శెట్టి విశ్వేశ్వరరావు పనిచేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎర్రం శెట్టి రామకృష్ణ, ప్రత్తి యగాయ్య, పెమ్మ అత్తిలేష్ పాల్గొన్నారు.