కోమాలోనే ఉన్నమాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ను ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసారు. ఆయన ప్రస్తుతం డీప్ కోమాలో ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగిందని, మూత్రపిండాలు కూడా పని చేయడం లేదని వివరించారు. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారని వైద్యులు తెలిపారు.