అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం.. న‌లుగురి మృతి

అమెరికాలో మ‌రోసారి కాల్పుల కలకలం చెల‌రేగి, న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. వాషింగ్టన్‌లోని కెన్నెవిక్‌లో ఓ దుండగుడు కాల్పులకు పాల్ప‌డ్డాడ‌ని అధికారులు తెలిపారు. అత‌డి చేతిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించారు.

ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చ‌ర్య‌లు తీసుకున్నారు. దుండ‌గుడిని గుర్తించి పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌డంతో అత‌డు హ‌త‌మ‌య్యాడు. దుండ‌గుడు ఓ ట్ర‌క్కులో వ‌చ్చి, దానిలో ఉండే కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.