కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య: ఢిల్లీ సీఎం

కొవిడ్‌ బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ”కరోనా బారినపడి చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు.

ఇలాంటి పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంరక్షణతోపాటు ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది” అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 10వేల లోపు కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.