పేదలకు ఉచిత రేషన్ బియ్యం .. ఆక్వా రైతులకు సబ్సిడీ మీద విద్యుత్ కొనసాగించాలని.. బిజెపి, జనసేనల ధర్నా

ముదినేపల్లి ఎం.ఆర్.ఓ ఆఫీసువద్ద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం 4 నెలలుగా పేదలకు ఇవ్వకుండా నిలుపుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా మరియు ఆక్వా రైతులకు సబ్సిడీ మీద విద్యుత్ బిల్లును గతంలో లాగానే కొనసాగించాలని.. సొమవారం ఎం.ఆర్.ఓ ఆఫీస్ వద్ద మరియు విద్యుత్ ఏఈ కార్యాలయం వద్ద బీజేపీ, జనసేన నాయకులు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం ఎం.ఆర్.ఓ ఆఫీస్ లో, విద్యుత్ ఏఈ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడంజరిగింది. ఉచిత రేషన్ బియ్యాన్ని జగన్ ప్రభుత్వం వెంటనే పేదలకు ఇవ్వాలని, ఆక్వా రైతులకు సబ్సిడీ మీద విద్యుత్ గతంలో లాగానే కొనసాగించాలని, బిజెపి, జనసేన పార్టీ డిమాండ్ చేసింది.. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ, జనసేన మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి వెల్పురి నానాజీ, జనసేన నియోజకవర్గ అధికార ప్రతినిధి వర్రే హనుమా, బీజేపీ మండల ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ రవి, జనసేన నియోజకవర్గ కోర్ కమిటీ సభ్యులు మోటేపల్లి హనుమ ప్రసాద్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రావు,బీజేపీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యవోలు నాగలక్ష్మి, బాసిన సెట్టి కిషోర్, అంబుల భరత్, బీజేపీ మండల మహిళా అధ్యక్షురాలు రెడ్డి నాగలక్ష్మి, మండల కార్యదర్శి బుజంగ రావు, జనసైనికులు మొహమ్మద్ నజీర్, పట్టపు కొండ పాల్గొన్నారు.