జనసేన తీర్ధం పుచ్చుకున్న గొల్లప్రోలు సీనియర్ నాయకులు

  • గొల్లప్రోలు పట్టణంలో జనసేన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం బలిరెడ్డి గంగబాబు, వారి అనుచరవర్గం చేరికతో మరింత బలం
  • పిఠాపురం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి 50వేలకు పైగా భారీ మెజార్టీ రావడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను అని వెల్లడించిన బలిరెడ్డి గంగబాబు
  • పిఠాపురం నియోజకవర్గంలో మా సమావేశాలు మొదలయ్యే సమయానికి కరెంట్ కట్ లు సర్వసాధారణం
  • ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజల ఆస్థులతో పాటు ఓట్లును కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి
  • రాజకీయ నాయకులు చేసిన తప్పులకు సామాన్యులు బలి అవుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం
  • రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చిన పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం నియోజకవర్గం: జనసేనలో శుక్రవారం గొల్లప్రోలు పట్టణంలో వివిధ పార్టీల నుంచి సీనియర్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో గొల్లప్రోలు పట్టణం సీనియర్ నాయకులు బలిరెడ్డి గంగబాబు ఆయన కార్యవర్గంతో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్బంగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ బలిరెడ్డి గంగా బాబు గారిని మనస్పూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు. పార్టీలో పెద్దలు, అనుభవజ్ఞులు అవసరం ఎంతగానో ఉంది అని గంగ బాబు గారు జనసేనలోకి రావడం చాలా ఆనందంగా ఉంది, ఆయనకి పార్టిలో సముచిత స్థానం కల్పిస్తామని తెలియజేసారు. జనసేనలోకి వచ్చిన గంగాబాబు గారు వారి మిత్ర బృందం మరియు పెద్దలకు నా హృదయ పూర్వక అభినందనలని అన్నారు. నేను ఏ మూలకు వెళ్ళినా ఎన్నో సమస్యలు తెలియజేస్తున్నారు అని సమస్య రహిత పాలన పవన్ కళ్యాణ్ గారి ద్వారానే సాధ్యపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అప్పులతో తిప్పలు తప్పేలా లేవు అనంతరం ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుబడుతూ అప్పు తీసుకున్న విధానమే నేరపూరితంగా ఉండడం ఆందోళనగా ఉంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఈ సంస్థకు మద్యం ఆదాయాన్ని బదిలీ చేసి దీన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి కోట్లు రూపాయలు రుణం తీసుకుని అప్పు మీద అప్పు చేస్తూ అభివృద్ధిని అటక ఎక్కించారు అని ఏద్దేవా చేశారు. వైసీపీ అరాచక పాలన వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి డబ్బులు తేవడం పక్కన పెడితే తిరిగి మన డబ్బులనే కేంద్రానికి అప్పుల రూపంలో చెల్లించడం నిజంగా దారుణం అని ధ్వజమెత్తారు. మన ఆస్థులు మీద ప్రభుత్వ పెత్తందారుల పెత్తనం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డ్‌ ప్రైమ్‌ 2.0 గురించి సభలో స్పష్టంగా అందరికి అర్థమయ్యేలా వివరిస్తూ మన ఆస్థులను లక్కోవడానికి కొత్త విధానం తీసుకుని వచ్చారు అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాలంటీర్స్ ద్వారా డేటా మొత్తం సేకరించి డిజిటలైజేషన్ పేరుతో ప్రజలు ఆస్తులతో ఆడుకోవాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వన్నీ ఇంకొన్ని రోజుల్లో మీరు అందరు బటన్ నొక్కి ఇంటికి పంపించేయాలి అని విజ్ఞప్తి చేశారు. నూతనంగా చేరిన గంగబాబు మాట్లాడుతూ జనసేన ఆశయాలు ఆలోచనలు పట్ల ఆకర్షితుడుని అయ్యాను అని ఉదయ్ శ్రీనివాస్ గారి నాయకత్వం మీద విశ్వాసం ఉంది అని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి 50 వేలకు పైగా భారీ మెజారిటీ వచ్చేలా గెలిపించుకోవడానికి నా వంతు కృషి చేస్తాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.