మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి..

జిహెచ్ఎంసి మేయర్ గా గద్వాల్ విజయ లక్ష్మి బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి తలసాని, కేకే, దానం నాగేందర్ హాజరయ్యారు. చార్జీ తీసుకున్నాక తండ్రి కేకే ఆశీస్సులు తీసుకున్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. కాసేపట్లో గన్ పార్క్ కు వెళ్లనున్న మేయర్ అక్కడ అమరవీరుల స్థూపం వద్ద వారికి నివాళులు అర్పించానున్నారు. హైదరాబాద్ మేయర్,డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నప్పటికీ వాళ్ళు ఇంకా చార్జ్‌ తీసుకోలేదు. అయితే ముహూర్తం బాగుండటంతో సోమవారం బాధ్యతలు తీసుకోనున్నారు. ఫిబ్రవరి 11న నగర మేయర్ ఎన్నిక పూరైంది. మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు. ఇవాళ విజయలక్ష్మి మేయర్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో బాధ్యతలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఏడో అంతస్తులో చాంబర్‌ను సిద్ధం చేశారు. విజయలక్ష్మీ బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్ గా విజయం సాధించారు.